జగన్ దీక్ష మూడో రోజుకు... ఢిల్లీకి వైఎస్ఆర్ సీపీ నేతలు

మంగళవారం, 27 ఆగస్టు 2013 (11:30 IST)
File
FILE
జగన్ మోహన్ రెడ్డి చంచల్‌గూడ జైలులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మంగళవారానికి మూడో రోజుకు చేరింది. దీంతో జైలు వద్ద భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. మరోవైపు జగన్ పార్టీకి చెందిన వైఎస్ఆర్ సీపీ నేతలంతా రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ఏకరవు పెట్టేందుకు మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.

ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఢిల్లీకి చేరుకున్న వీరంతా డాక్టర్ మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రధానమంత్రిని, మధ్యాహ్నం ఒక్క గంటకు రాష్ట్రపతిని కలువనున్నారు. ఈ సందర్భంగా వారంతా సీమాంధ్ర ఉద్యమాన్ని వారి దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.

వెబ్దునియా పై చదవండి