వైఎస్సార్ వుంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు... విజయమ్మ

మంగళవారం, 27 ఆగస్టు 2013 (15:30 IST)
FILE
వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నట్లయితే రాష్ట్ర విభజన సమస్య వచ్చి ఉండేది కాదని ప్రధానమంత్రి తనతో అన్నట్లు వైఎస్ విజయమ్మ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రకటన చేసిన నేపధ్యంలో తలెత్తిన పరిస్థితులపై వైఎస్ విజయమ్మ మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు.

అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉన్న ప్రజల మధ్య ద్వేషాలు పెరుగుతున్నాయనీ, రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోయిందని ప్రధానితో చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగేట్లు చేస్తేనే రాష్ట్ర విభజన చేయాలనీ, లేదంటే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.

విజయమ్మ ప్రధానికి ఇచ్చిన లేఖలో జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష గురించి కూడా పేర్కొన్నారు. కాగా సీమాంధ్ర ప్రజల అభ్యంతరాలన్నీ తాము త్వరలో ఏర్పాటు చేయబోయే మంత్రుల బృందం కమిటీ ముందు చెప్పవచ్చని ప్రధాని తనకు హామీ ఇచ్చినట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి