సీమాంధ్రలో టీడీపీ - బీజేపీ కేడర్‌ గందరగోళం... దోస్తీ కటీఫ్!

గురువారం, 17 ఏప్రియల్ 2014 (10:05 IST)
File
FILE
టీడీపీ, బీజేపీల మధ్య దోస్తీ కటీఫ్ అయ్యేలా సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీకి కేటాయించిన స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను నిలుపుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. దీని కారణంగా బీజేపీ, టీడీపీ దోస్తీ గందరగోళంలో పడింది. టీడీపీ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకోకపోవడం ఆ పార్టీ మంచిదని హితవు పలికింది. దీంతో టీడీపీ మూడో జాబితా విడుదలను వాయిదా వేసింది. మరో వైపు దోస్తీ రద్దైతే..! తక్షణం మరింత మంది అభ్యర్థులను బరిలో దించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది.

దీనిపై ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ నేతలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇరు పార్టీల మధ్య పొత్తు యధావిధిగా కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి