పద్మశ్రీ: సుప్రీంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ఊరట

గురువారం, 17 ఏప్రియల్ 2014 (12:39 IST)
File
FILE
తెలుగు నటుడు మోమన్ బాబు తనకు కేంద్ర ప్రభుత్వం బహూకరించిన 'పద్మశ్రీ' అవార్డును దుర్వినియోగం చేసారంటూ కోర్టు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య హైకోర్టు తన తీర్పులో మోహన్ బాబు స్వచ్ఛందంగా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేయాలని పేర్కొంది. ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబుకు గురువారం ఊరట లభించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారం విషయంలో నెలకొన్న వివాదంలో సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయాలంటూ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది.

అదేసమయంలో ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కొన్ని రోజుల కిందట మోహన్ బాబు, హాస్య నటుడు బ్రహ్మానందం సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. ఆ వెంటనే విచారణ చేపట్టిన న్యాయస్థానం, అఫిడవిట్ దాఖలు చేయాలని డైలాగ్ కింగ్‌ను ఆదేశించింది. అటు ఇప్పటివరకు పద్మశ్రీని ఉపయోగించిన ప్రతిచోట తొలగించాలని కూడా ఆదేశాలిచ్చిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి