బాలకృష్ణకు ఓటమి ఫీవర్!! ... ఇంటింటి ప్రచారానికి శ్రీకారం

గురువారం, 17 ఏప్రియల్ 2014 (13:28 IST)
File
FILE
సినీ నటుడు, హిందూపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు ఓటమి భయం పట్టుకుందా? అనే సందేహం ఉత్పన్నమవుతోంది. బుధవారం నామినేషన్ తర్వాత ఆయన ఇంటింటి ప్రచారానికి శ్రీకారంచుట్టడం చూస్తుంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ కంచుకోటల్లో ఒకటైన హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్‌ను బాలకృష్ణ ఏరికోరి ఎంచుకున్నారు. అలాంటి కంచుకోటలో బాలయ్య ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరోవైపు.. ఈ నెల 20 నుంచి పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని బాలకృష్ణ నిర్ణయించారు. ఈ క్రమంలో రోజుకో జిల్లాలో ఆయన రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. విభజనతో సీమాంధ్రలో టీడీపీ బలపడినట్టుగా చంద్రబాబు, బాలకృష్ణ భావిస్తున్నారు. ఈ దశలో రోడ్‌షోలు చేయడం వల్ల పార్టీకి మరింత లాభం చేకూరుతుందన్న ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్టు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి