హరికృష్ణకు హ్యాండిచ్చిన చంద్రబాబు.. ఐదో జాబితాలో కూడా?

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (11:00 IST)
FILE
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణకు బావ చంద్రబాబు హ్యాండిచ్చారు. తాజాగా విడుదల చేసిన ఐదో జాబితాలో కూడా హరికృష్ణ పేరులేకపోవడంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. తొలి నాలుగు జాబితాలో పేరు లేకపోయినా ఐదో జాబితాలో తప్పనిసరిగా తనకు సీటు కేటాసిస్తారని హరి భావించారు కానీ ఈ జాబితాలో కూడా పేరు లేకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై హరికృష్ణ గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

తొలుత హిందూపురం టిక్కెట్ కోసం హరికృష్ణ ప్రయత్నించగా అది బాలకృష్ణకు కేటాయించడంతో, కృష్ణా జిల్లాలో ఏదో ఒక స్థానాన్ని తనకు కేటాయిస్తారని ఆయన భావించారు. ఒకవేళ అక్కడినుంచి కాకపోయినా నూజివీడు అసెంబ్లీ స్థానానికైనా తన పేరు ప్రకటిస్తారని హరికృష్ణ ఆశించారు.

అయితే, ఆ సీటును ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు కేటాయించారు. దీంతో బావ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న సీతయ్య తనకు కృష్టా జిల్లాలో టిక్కెట్ ఇస్తారని ఆశించానని, అది కూడా ఇవ్వకపోవడం దారుణమని కారాలు మిరియాలు నూరుతుండటం కొసమెరుపు.

వెబ్దునియా పై చదవండి