ఒక్కసీటు మార్పుతో భాజపా-తెదేపా పొత్తు షురూ... జవదేకర్ ప్రకటన

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (17:53 IST)
FILE
తెదేపా, భాజపాల మధ్య పొత్తు సస్పెన్సుకు తెర దించారు. ఒకే ఒక్క సీటు మార్పుతో భాజపా-తెదేపాల మధ్య పొత్తుపై సయోధ్య కుదిరింది. గత రెండు రోజులుగా టిడిపి, బిజెపిల మధ్య పొత్తు వివాదం చెలరేగిన నేపధ్యంలో శుక్రవారం ప్రకాశ్ జవదేకర్ చంద్రబాబుతో సుదీర్ఘ మంతనాల అనంతరం సమస్య సద్దుమణిగింది.

ఐతే ఒక దశలో రెండు పార్టీల మధ్య సీమాంధ్రలో పొత్తు ఉండదేమోనన్న అనుమానం కూడా వచ్చింది. కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ పొత్తుతో ముందుకు వెళుతున్నాయి భాజపా-తెదేపా.

వెబ్దునియా పై చదవండి