అబ్బే తెదేపా-భాజపా మధ్య పొత్తు గొడవలు లేవు... రావు

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (20:02 IST)
FILE
సీమాంధ్ర ప్రాంతంలో పొత్తులపై తెలుగుదేశం, బిజెపిల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన సుఖాంతమయ్యింది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం విజయనగరం జిల్లా గజపతి నగరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీమాంధ్రలో బిజెపితో పొత్తు ఉండదని ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య పొత్తు పెడాకులయ్యిందని అనుకున్నారు. దీంతో భాజపా సీనియర్ నాయకుడు జవదేకర్ హుటాహుటిన ఢిల్లీ నుంచి వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఉత్కంఠ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలం కావడంతో పొత్తు కొనసాగుతుందని ఇరు పార్టీలు ప్రకటించాయి.

రెండు రోజుల నుంచి భాజపా-తెదేపా పొత్తు సీమాంధ్రలో పెడాకులైపోయిందంటూ నానా రభస జరిగింది. ఇవాళ ఉదయం అది మరీ తీవ్రస్థాయికి చేరుకుంది. ఐతే చిట్టచివరికి 1 అసెంబ్లీ స్థానాన్ని లాగించుకుని తెదేపా గప్ చిప్ అయ్యింది. దీంతో కొండను తవ్వి 1 ఎలుకను మాత్రమే బాబు పట్టారంటూ ఎద్దేవా చేస్తున్నాయి వైరివర్గాలు.

ఇరు పార్టీల సమావేశం అనంతరం ఒకే ఒక్క సీటు మార్పుతోనే సీమాంధ్రలో టిడిపితో బిజెపి పొత్తు కొనసాగుతుందని ఆ పార్టీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. భాజపా సీమాంధ్రలో 13 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలు, మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపికి ఇచ్చేందుకు అంగీరించడంతో ఇచ్ఛాపురం అసెంబ్లీని వదులుకున్నట్లు జవదేకర్ స్పష్టం చేశారు.

పొత్తు కుదిరిన చోట పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన తెలిపారు. ఇచ్ఛాపురం సీటుకు బదులుగా ఎమ్మెల్సీ సీటును ఇచ్చేలా టిడిపి అంగీకరించడంతో పొత్తుపై ప్రతిష్టంభన తొలగిపోయింది

వెబ్దునియా పై చదవండి