13 ఏళ్లకే బాలికను తల్లినిచేసిన యువకుడు.. ఇంకో బాలికతో పెళ్లి!

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (13:10 IST)
FILE
13 ఏళ్లకే ఓ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఓ యువకుడి మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకుని తల్లిని చేశాడు. తీరా తనని పెళ్లి చేసుకోవాలని కోరితే, అందుకు అతడు నిరాకరించాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనా వివరాలిలావున్నాయి....

కడప జిల్లా వానరాచపల్లెలోని కస్తూర్బా పాఠశాలలో ఏడోతరగతి చదువుతోన్న బాలికతో స్థానికంగా ఉంటోన్న నాగార్జున నాయక్ అనే యువకుడు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో బాలిక గర్భవతి అయింది. తాజాగా ఆమె ఈనెల 4న ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బాధితురాలి తల్లిదండ్రులు గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లారు. వారు చెప్పినా ఆ యువకుడు పెళ్లికి నిరాకరించాడు. పైగా అతడు ఇంకో బాలికను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు మంగళవారం రాయచోటి గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి