హరికృష్ణకు బాబు హ్యాండ్... మీడియా ముందుకు జూ. ఎన్టీఆర్

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (20:14 IST)
WD
ఎన్నికలు 2014 బరిలో తన తండ్రి నందమూరి హరికృష్ణకు చంద్రబాబు మొండిచేయి చూపడంతో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ గురువారం మీడియా ముందుకు వస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 2014 ఎన్నికలు నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా పిలవాల్సిన పని లేదని బాలకృష్ణ వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

దీనిపై స్పష్టత ఇచ్చేందుకు రేపు గురువారంనాడు ఎన్టీఆర్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వనున్నారని అంటున్నారు. ఐతే హరికృష్ణకు తెదేపా పోటీ చేస్తున్న స్థానాల్లో ఎక్కడా చోటు పెట్టకుండా ముందుకు వెళ్లిన చంద్రబాబు ఇవాళ పవన్ కళ్యాణ్ ను కలవడంపైనా జూనియర్ ఎన్టీఆర్ గరంగరంగా ఉన్నట్లు సమాచారం. మరి వీటన్నిటికీ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలి.

వెబ్దునియా పై చదవండి