శోభానాగిరెడ్డి కన్నుమూత :: ఆళ్ళగడ్డ ఎన్నికపై పాలిటిక్స్!!

గురువారం, 24 ఏప్రియల్ 2014 (17:06 IST)
File
FILE
రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన శోభానాగిరెడ్డి పోటీ చేస్తున్న ఆళ్ళగడ్డ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై అపుడు రాజకీయాలు ఆరంభమయ్యాయి. ఆళ్లగడ్డ ఎన్నిక నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) తుది నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. సీఈసీ ఆదేశాల మేరకే అక్కడ ఎన్నికను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి మృతి విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్తామని భన్వర్ లాల్ చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో పాటు ప్రధానమైన పార్టీ నుంచి ఆమె పోటీలో ఉన్న విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తామని ఆయన అన్నారు.

ఈ నివేదికపై స్పందించిన సీఈసీ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా జరుగుతాయని వెల్లడించింది. 1951 ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 52 ప్రకారం యథావిధిగా ఎన్నికలు జరుపనున్నట్లు సీఈసీ తెలిపింది. సెక్షన్ 52 ప్రకారం ఈసీ గుర్తింపు లేని పార్టీ అభ్యర్థి మరణించినా ఎన్నికలు జరుపవచ్చన్న నిబంధనకు అనుగుణంగా సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

వెబ్దునియా పై చదవండి