ఎల్టీటీఈ కొత్త చీఫ్ పద్మనాభన్ ఆస్తుల జప్తు: లంక

బుధవారం, 2 డిశెంబరు 2009 (17:29 IST)
శ్రీలంకలోని తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ కొత్త చీఫ్ సెల్వరాజన్ పద్మనాభన్ ఆస్తులను జప్తు చేసినట్టు శ్రీలంక మంత్రి ఒకరు తెలిపారు. సెల్వరాజన్ పద్మనాభన్‌కు ఐదు ఓడలతో పాటు.. 600 బ్యాంకులలో అకౌంట్లు ఉన్నట్టు ఆయన తెలిపారు. వీటినన్నింటిని జప్తు చేసినట్టు లంక మంత్రి తెలిపారు.

ఎల్టీటీఈపై జరిపిన పోరులో శ్రీలంక సైనం విజయం సాధించిన విషయం తెల్సిందే. ఆ సంస్థ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ హత్యకు గురైన తర్వాత ఎల్టీటీఈ చీఫ్‌గా సెల్వరాజన్ పద్మనాభన్ బాధ్యతలు చేపట్టారు. ఈ బాధ్యతలు చేపట్టిన రెండు మూడు రోజుల్లోనే ఈయనను కెనడాలో ఇంటర్‌పోల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులను కూడా జప్తు చేసినట్టు లంక మంత్రి ప్రకటించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి