ఆఫ్ఘనిస్థాన్‌లో మొహరించిన ఉన్న బలగాలను ఇప్పటికిపుడే ఉపసంహరించే ఉద్దేశం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఆఫ్ఘన్‌లో శాంతియుత వాతావరణం నెలకొంటే బలగాలను వెనక్కి పిలిపిస్తామని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపినట్టు ఆ దేశ ప్రత్యేక దూత రిచర్డ్ హాల్‌బ్రూక్ తెలిపారు.
ఆప్ఘన్‌లో మొహరించి ఉన్న బలగాలను దశల వారీగా ఉపసంహరించుకోనున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలపై ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్‌లకు ప్రత్యేక దూతగా వ్యవహరిస్తున్న రిచర్డ్ హాల్‌బ్రూక్ తెలిపారు.
ఈయన ప్రస్తుతం ఆఫ్ఘన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు హమీద్ ఖర్జాయ్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్ఘన్‌లో శాంతి స్థాపన కోసమే బలగాలను మోహరించామన్నారు.
ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకోవడం తమ ప్రధానోద్దేశం కాదని హాల్‌బ్రూక్ స్పష్టం చేశారు. ఆఫ్ఘన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్న మరుక్షణం తాము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని హాల్‌బ్రూక్ చెప్పారు.