ముంబై దర్యాప్తు ఆలస్యానికి భారతే కారణం: పాకిస్థాన్

ముంబై దాడుల11:48 AM 11/28/2010 కేసు దర్యాప్తులో జాప్యం నెలకొనడానికి భారతే ప్రధాన కారణమని పాకిస్థాన్ ఆరోపించింది. రెండేళ్ల క్రితం ముంబై కేంద్రంగా జరిగిన ఉగ్రవాద దాడుల్లో పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న ఏడుగురు నిందితులపై పాక్ కోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ విచారణ భారత్ వైఖరి కారణంగానే నిలిచిపోయిందని పాకిస్థాన్ ఆరోపించింది.

ముంబై దాడుల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పాక్‌కు భారత్ ఒక లేఖ రాసింది. ముంబై దాడుల కేసులో దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి ముష్కరులను శిక్షించాలని కోరింది. దీనిపై పాక్ స్పందించింది. 26/11 దాడులకు సంబంధించి తాము నియమించిన కమిషన్‌కు భారత్‌లో పర్యటించి, ముఖ్యమైన సాక్షులను విచారించేందుకు భారత్ అనుమతివ్వకపోవడం వల్లనే ఆలస్యం జరుగుతోందన్నారు.

ముంబై దాడులకు పాల్పడిన పది ముష్కరుల్లో తొమ్మిది మందిని భారత భద్రతా బలగాలు కాల్చివేయగా, అజ్మల్ కసబ్ అనే తీవ్రవాదిని ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఈ కేసులో ప్రాణాలతో ఉన్న ఏకైక వ్యక్తి కసబ్ ఈ కేసులో కీలక సాక్షి.. ఆయనను విచారించాల్సిన అవసరం మా కమిషన్‌కు ఉందని, మా కోర్టులు దానినే అంగీకరిస్తాయని పాక్ పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి