భారత్‌కు వచ్చేందుకుగాను పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు వీసా ఇచ్చేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్‌లో జరుగనున్న ఓ సదస్సులో పాల్గొనాల్సిందిగా పర్వేజ్ ముషారఫ్‌కు ఆహ్వానం అందిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఆయనకు వీసా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది.
భారత్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొనేందుకుగాను వీసా మంజూరు చేయాలని ముష్ తరపున కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం చేరింది. అయితే వీసాను మంజూరు చేయడానికి భారత అంతర్గత శాఖ నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ముషారఫ్‌కు ఎందుకు వీసా నిరాకరించారనే కారణాన్ని మాత్రం అంతర్గత శాఖ స్పష్టంగా తెలియజేయలేదు. కానీ ముషారఫ్ భారత్ పర్యటనపై కేంద్ర ప్రభుత్వానికి అనుమానాలు తలెత్తడమే వీసా ఇవ్వకపోవడానికి కారణమంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.