జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధి పనులను అడ్డుకున్న చైనా

భారత భూభాగంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చైనా సైనికులు బలవంతంగా అడ్డుకున్నారు. ఈ తరహా చర్యలకు చైనా సైనికులు పాల్పడటం ఇది తొలిసారి కావడం కాదు. గతంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇదే విధంగా అభివృద్ధి పనులతో పాటు.. మొబైల్ ఫోన్ టవర్ల నిర్మాణాన్ని కూడా అడ్డుకున్న విషయం తెల్సిందే.

తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకున్నట్టు మీడియా కథనాలు వస్తున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ భారత ప్రభుత్వం చైనాను ఘాటుగా హెచ్చరించిన దాఖలాలు కనిపించలేదు. దీంతో చైనా సైనికులు మరింత రెచ్చిపోతున్నారు.

ఈ నేపథ్యంలో గత యేడాది అక్టోబరు-సెప్టెంబరు నెలల్లో ఆగ్నేయ లఢక్‌కు సమీపంలోని లే ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు గ్రామంలో అభివృద్ధి పనులు సాగకుండా అడ్డుకున్నారు.

ఈ గ్రామ ప్రాంతానికి మోటార్ సైకిళ్ళపై వచ్చిన చైనా సైనికులు కాంట్రాక్టరును పిలిచి పనులు చేయరాదని బెదిరించినట్టు సమాచారం. దీంతో పనులను నిలిపి వేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి