భారత్‌, చైనాలతో అమెరికా సన్నిహితంగా మెలగాలి: మూన్

ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వర్థమాన దేశాలైన్ భారత్, చైనాలతో అగ్రరాజ్యం అమెరికా మరింత సన్నిహితంగా మెలగాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అభిప్రాపయడ్డారు. ఇది ఐక్యరాజ్యసమితి మరింత సమర్థవంతంగా వ్యవహరించేందుకు దోహదపడుతుందన్నారు.

శనివారం ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అంటే అమెరికాను మాత్రమే సూచించే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారి భారత్‌, చైనా, దక్షిణ కొరియా వంటి వర్ధమాన దేశాలు ప్రపంచ యవనికపైకి దూసుకొస్తున్నాయని అన్నారు. ఈ దేశాలన్నీ ఆర్థికంగా, ప్రజాస్వామికంగా గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయన్నారు.

వెబ్దునియా పై చదవండి