ముచ్చటగా మూడో సారి పదవి కోసం వ్లాదిమిర్ పుతిన్‌ పాట్లు

శుక్రవారం, 24 ఫిబ్రవరి 2012 (11:23 IST)
File
FILE
పదవి ఒక్కసారి చేతికి వస్తే వదల బుద్ది కాదు. ఇది ఒక భారతదేశంలోనే కాదు. అన్ని ప్రపంచ దేశాలలోనూ ఇదే పరిస్థితి అవకాశం వస్తే జీవితకాలం కుర్చీకి అంటి పెట్టుకోవాలని ఉంటుంది. సరిగ్గా రష్యా ప్రధాని ద్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఇలానే వ్యవహరిస్తున్నారు. ముచ్చటగా మూడో పర్యాయం పదవి కావాలని కలలు కంటున్నారు. అందుకోసం దేశమంతటా పరుగులు పెడుతున్నారు. తనకు ఓ చోట పది ఓట్లు రాలతాయంటే చాలు ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. దేశ పౌరులను ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజాస్వామంలో ఎంతవారైనా ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవాల్సందే మరి… ఇంతకీ పుతిన్‌ పడుతున్న పాట్లు ఏమిటో చూద్దాం రండీ…

గత డిసెంబర్‌లో మాస్కోలో గడ్డకట్టే మంచును సైతం లెక్క చేయకుండా 1.2 లక్షల మంది నిరసనలో పాల్గొన్నారు. దాదాపు అన్ని నగరాలలో ర్యాలీలు నిర్వహించారు. ఇది గమనించిన ఎక్కడో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని భావించారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న పుతిన్‌ పురపాలక, స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు అందించారు. నిధుల బడ్జెట్‌లో పాలసీలలో అధికార గణానికి స్వతంత్రత కల్పించారు. అలాగే పాలనపరమైన విషయాలలో కూడా స్థానిక సంస్థలకు కూడా ప్రాధాన్యత కల్పించే దిశగా అడగులు వేస్తున్నారు.

రష్యాలో కూడా అవినీతి జాఢ్యం భారీ ఎత్తునే ఉంది. అవినీతి, లంచావతారాలపై ప్రజలు మండి పడుతున్నారు. వారి కోపాన్ని చల్లార్చేందుకు పుతిన్‌కొత్త ఎత్తులు వేస్తున్నారు. బ్యూరోక్రట్‌ విధానాన్ని సమూలంగా మార్చనున్నట్లు వివరించారు. అదే సమయంలో లంచావతారాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పుకొస్తున్నారు. మొత్తంపై పదవిపై ఉన్న కాంక్ష ఎంతపైనా చేయిస్తుంది.

వెబ్దునియా పై చదవండి