భారత్‌తో సత్సంబంధాలను ఆశిస్తున్న పాక్ : హీనా రబ్బానీ

శుక్రవారం, 13 జులై 2012 (09:38 IST)
File
FILE
ముంబై దాడులతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు సంబంధాలు తూచా మంత్రంగా సాగుతున్న నేపథ్యంలో... పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ మాత్రం భారత్‌తో సత్సంబంధాలను పాకిస్థాన్ ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని రబ్బానీ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్‌ల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేసేందుకు చర్చలు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సర్ క్రీక్ మరియు నీటి పంపిణీ వంటి పలు అంశాలపై భారత్-పాకిస్థాన్‌లు చర్చల ద్వారా పరిష్కరించేందుకు పాక్ సంసిద్ధంగా ఉన్నట్లు రబ్బానీ అన్నారు.

వెబ్దునియా పై చదవండి