దక్షిణ కొరియా పడవ ప్రమాదం.. 293మంది గల్లంతు!

గురువారం, 17 ఏప్రియల్ 2014 (09:02 IST)
దక్షిణ కొరియాలో భారీ దుర్ఘటన సంభవించింది. 476మందితో కూడిన ఒక పెద్ద ఓడ (ఫెర్రీ) సముద్రంలో మునిగిపోయింది. ఈ పడవ ప్రమాదంలో వంద మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు గల్లంతయ్యారు. విహార యాత్రకు వెళ్లిన చిన్నారులు గల్లంతు కావడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంచియాన్ నుంచి బెజు ద్వీపానికి నౌకలో విద్యార్థులు, టీచర్లు విహార యాత్రకు బయలుదేరారు.

ఈ నౌకలో మొత్తం 476 మంది దాక ఉన్నారు. అందులో 338 మంది హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. అంతేగాక పదుల సంఖ్యలో కార్లు, ట్రక్కులను రవాణా చేస్తోంది. నైరుతి తీరం వద్ద నౌక సముద్రంలో మునిగిపోయింది. అప్పటిదాక ఉత్సాహంగా ఉన్న విద్యార్థులు హాహాకారలతో నౌకా ప్రాంగణం మారుమ్రోగిపోయింది. ఈ ఘటనలో 293 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైనవారి కోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.

18 హెలికాప్టర్లు, 34 లైఫ్‌ బోట్లతో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 368 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ప్రయాణికులంతా లైఫ్‌ జాకెట్లతో దూకటం వల్ల పెను ప్రమాదం తప్పిందని, సహాయక చర్యలను వేగవంతం చేసినట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి