దక్షిణ కొరియా ఓడ ప్రమాదం : 287 మంది జలసమాధి!

గురువారం, 17 ఏప్రియల్ 2014 (12:12 IST)
File
FILE
దక్షిణ కొరియా తీరంలో చోటు చేసుకున్న ఓడ ప్రమాదంలో గల్లంతైన 287 మంది జల సమాధి అయినట్టు భావిస్తున్నారు. మొత్తం 475 మందితో వెళుతున్న నౌక ఒకటి బుధవారం తెల్లవారుజామున ప్రమాదంలో చిక్కుకుని క్రమంగా నీటిలో ముగినిపోయిన విషయం తెలిసిందే.

ఈ విషయం తెలుసుకున్న దక్షిణ కొరియా తీరరక్షక దళం సిబ్బంది నౌకలో ఉన్న వారిలో 179 మందిని రక్షించారు మిగిలిన వారి కోసం సహాయక చర్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అయినప్పటికీ వారి ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదు. దీంతో గల్లంతైన వారంతా జలసమాధి అయినట్టుగా భావిస్తున్నారు.

కాగా, ఓడలో ప్రయాణిస్తున్న వారిలో 375 మంది హైస్కూల్ విద్యార్థులు ఉన్నారు. టీచర్లతో కలసి ప్రముఖ పర్యాటక క్షేత్రం జేజుకు వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు. ఆచూకీ లేకుండా పోయిన 287 మందిలో ఎవరూ జీవించి ఉండే అవకాశం లేదని తీరరక్షకదళం అధికారులు భావిస్తున్నారు. వీరి జలసమాధిని అధికారికంగా ధ్రువీకరిస్తే దక్షిణ కొరియా దేశంలో ఇదొక అతిపెద్ద ప్రమాదంగా నిలిచిపోతుంది.

వెబ్దునియా పై చదవండి