ఇన్‌సైడర్ ట్రేడింగ్ : జూన్ 17 నుంచి రజత్‌గుప్తాకు జైలుశిక్ష

ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (12:46 IST)
File
FILE
అమెరికాలో అతిపెద్ద ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో పట్టుబడిన ప్రవాస భారతీయుడు, గోల్డ్‌మన్ శాక్స్ మాజీ డైరెక్టర్ రజత్ గుప్తాకు విధించిన రెండేళ్ల జైలుశిక్ష జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.

గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును రజత్ గుప్తా పై కోర్టులో సవాల్ చేసి ఓడిపోయారు. దీంతో యూఎస్ జిల్లా కోర్టు జడ్జి జేడ్ రాకాఫ్ ఆయన్ని జూన్ 17న మధ్యాహ్నం రెండు గంటలలోపల లొంగిపోవాలని ఆదేశించారు.

గోల్డ్‌మన్ శాక్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు రహస్యంగా ఉంచాల్సిన బోర్డు నిర్ణయాలను రజత్ గుప్తా తన స్నేహితుడు, గెలిలియో హెడ్జ్ ఫండ్ వ్యవస్థాపకుడైన రాజ్ రాజరత్నంతో పంచుకున్నారని కోర్టులో నిరూపితం కావడంతో ఆయనకు జైలుశిక్ష విధించారు.

వెబ్దునియా పై చదవండి