మా పార్టీ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి: రాహుల్

గిరిజన యువత రాజకీయాల్లోకి రావాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కోరారు. వ్యవస్థలో ప్రతి ఒక్కరికి వినిపించేలా తమ గళాన్ని విప్పాలని గిరిజన యువతను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు.

"పంచాయితీలు, విధాన సభలు, పార్లమెంటులలో రాజకీయంగా తమ గళాన్ని వినిపించేందుకు గిరిజన యువత ముందుకు రావాలి, వారి మాటలను ప్రపంచం కూర్చుని ఎలా వింటుందో చూడాల"ని భారత జాతీయ విద్యార్థుల సమాఖ్య (ఎన్ఎస్‌యూఐ) ప్రతినిధులతో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో రాహుల్ చెప్పారు.

మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖ గిరిజన నేతలను ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని రాహుల్ ఉదహరించారు. జార్ఖండ్‌లో ఉన్న గిరిజన యువత కూడా ముందుకు రావాలని ఆయన కోరారు.

"జార్ఖండ్ ప్రభుత్వాన్ని మీరే స్వంతంగా నిర్మించండి. ఒకవేళ ప్రభుత్వం మీ మాట వినకపోతే, నేను మీకు మద్దతు ఇస్తాను, అందుకు మా సంస్థ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది" అని రాహుల్ గాంధీ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి