భూముల స్వాధీనానికి కొత్త చట్టం: మంత్రి వీరప్ప మొయిలీ

బుధవారం, 29 డిశెంబరు 2010 (09:40 IST)
పరిశ్రమల స్థాపన, వాణిజ్య అవసరాల కోసం భూములను స్వాధీనం చేసుకునేందుకు నూతన నిబంధనలు, మార్గదర్శకాలతో కూడిన ఒక చట్టాన్ని కేంద్రం ప్రవేశపెట్టనుందని కేంద్ర న్యాయశాఖామంత్రి వీరప్ప మొయిలీ వెల్లడించారు. ఆయన మంగుళూరులో మాట్లాడుతూ ఈ చట్టంలో భూముల స్వాధీనానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను నిర్ధేశిస్తామన్నారు.

ఇందుకుసంబంధించి ఒక ముసాయిదాను ఇప్పటికే సిద్ధం చేశామని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్ ముందు ప్రవేశపెడతామన్నారు. పరిశ్రమలు, సెజ్‌ల స్థాపనతో పాటు వాణిజ్య అవసరాలకు భూముల స్వాధీనానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలు, నిబంధనల్లో మార్పులు చేయాలని భావించినట్టు చెప్పారు.

భూముల స్వాధీన ప్రక్రియలో రైతుల ఏ విధంగానూ నష్టపోకూడన్నదే తమ ఆందోళన అని ఆయన చెప్పారు. ఇకపోతే.. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి