జీఎస్ఎల్‌వీ విఫలం: మాధవన్ నాయర్ నేతృత్వంలో కమిటీ!!

నింగికెగిసిన కొన్ని సెకన్లలోనే పేలిపోయిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్06 వైఫల్యంపై దర్యాప్తు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఒక కమిటీని నియమించింది. జీఎస్‌ఎల్‌వీ వైఫల్యంపై ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్ నేతృత్వంలో 11 మంది సాంకేతిక నిపుణులు సభ్యులుగా వైఫల్య విశ్లేషణ కమిటీ (ఎఫ్‌ఏసీ)ని ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

అలాగే, జీఎస్‌ఎల్‌వీ భవిష్యత్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మరో కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు ఆ ప్రకటన పేర్కొంది. జీఎస్‌ఎల్‌వీ కార్యక్రమం భవిష్యత్ గురించి విశ్లేషించేందుకు కార్యక్రమ సమీక్ష, వ్యూహం కమిటీని కూడా రాధాకృష్ణన్ ఏర్పాటు చేశారు. సమీప భవిష్యత్‌లో అవసరాలను తీర్చేందుకు స్వదేశీ క్రయోజనిక్ పరిజ్ఞానాన్ని అమలుచేసే అంశాన్ని ఇస్రో పరిశీలిస్తోంది.

వెబ్దునియా పై చదవండి