పేద ప్రజలకు చౌక ధరల్లో బియ్యం, గోధుమ పంపిణీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ)కి ఆమె ఛైర్‌పర్సన్‌గా ఉన్న విషయంతెల్సిందే. ఆమె నేతృత్వంలోని జాతీయ సలహా మండలి చేసిన విజ్ఞప్తిని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నిరాకరించింది. ప్రభుత్వ గిడ్డంకుల్లో వృధా అవుతున్న ధాన్యాన్ని పేద ప్రజలకు పంపిణీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు కూడా ఆదేశించిన విషయం తెల్సిందే.
ఈ ఆదేశాలను కూడా కేంద్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా ఎన్ఏసీ కూడా ఇదే తరహా సూచన చేసినప్పటికీ ప్రధానమంత్రి నేతృత్వంలోని ఆర్థిక సలహా మండలి తోసిపుచ్చింది. దేశంలో కనీసం 75 శాతం ప్రజలకు ఆహార ధాన్యాలు లభించే విధంగా, పేదలకు మాత్రమే గాకుండా సామాన్య ప్రజలకు కూడా చౌక ధరలో బియ్యం, గోధుమలు లభించేలా చేయాలని ఆమె సూచించారు.
ఈ మండలి సిఫార్సును పరిశీలించిన ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని నిపుణులు కమిటీకి ఇందుకు అంగీకరించలేదు. ఇంకా పేదలకు మాత్రమే ఆహార చట్టం కింద ధాన్యాలను ఇవ్వడం జరుగుతుందని, కిలో రెండు రూపాయలకు గోధుమలు, కిలో మూడు రూపాయలకు బియ్యం ఇవ్వవచ్చునని పేర్కొంది.