ఉత్తరప్రదేశ్ ఎన్నికలు : యువ నాయకులకు లిట్మస్ టెస్ట్!!

ఆదివారం, 1 జనవరి 2012 (17:43 IST)
ఈ యేడాదిలో జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నలుగురు యువనేతలకు లిట్మస్ టెస్ట్‌లా మారాయి. ఈ నలుగురు నేతల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, భాజపా నేత వరుణ్ గాంధీ, ఎస్పీ అధినేత ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్‌, అజిత్ సింగ్ కుమారుడు జయంత్ చౌదరీల ఉన్నారు.

ముఖ్యంగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం తర్వాత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒక విధంగా చెప్పాలంటే 2014లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు యూపీతో పాటు.. ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు.

అలాగే, రాహుల్‌ తరహాలోనే ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్‌కు మారాయి. ఈ రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీగా ముద్ర వేసుకున్న ఎస్పీ బాధ్యతలను తన భుజస్కంధాలకు ఎత్తుకోవాలంటే.. ఈ ఎన్నికల్లో పార్టీని విజయతీరానికి చేరాల్చిన గురుతర బాధ్యత ఈ యువనేతపైనే ఆధారపడివుంది.

అదేవిధంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆర్ఎల్‌డీ అధినేత అజిత్ సింగ్ తనయుడు జయంత్ చౌదరికి ఇదే సరైన అవకాశంగా చెపుతున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆర్ఎల్‌డి ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి