అన్నా చెల్లెళ్ల ప్రేమానురాగాల బంధం.. రక్షాబంధన్

బుధవారం, 21 ఆగస్టు 2013 (09:26 IST)
File
FILE
అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమానుబంధానికి గుర్తింపుగా జరుపుకునే పండుగే రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి). అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు మధ్య ఉండే ప్రేమానురాగాలకు శుభ సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు. దీనికి రాఖీ పౌర్ణమి అనే మరో పేరు కూడా ఉంది. హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్ట కలిగిన మాసం శ్రావణం. ఈ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమికి గల ప్రాముఖ్యత, విశిష్టత ఇంతింతని చెప్పనలవి కాదు.

సోదర సోదరీ ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రక్షా బంధన్ పండుగ వంటి అనేక ఉత్తమ పర్వాలను తనలో నిలపుకొన్నది ఈ శ్రావణ పౌర్ణమి. "నవ్య దీప్తితోడు నవ్వు తామరపువ్వు, సూర్య కిరణమింత సోకీనంత" అని కవి కరుశ్రీ చేసిన వర్ణన సోదరసోదరీ మణుల హృదయ స్పందనల సమ్మేళనమే. అంతటి శక్తివంతమైన రక్త సంబంధం కుటుంబ బంధం ప్రేరణగా దండలో దారంలా నేటికీ అలరారుతూనే ఉంది.

ఈ రక్షా బంధనం, రక్త సంబధీలకునే కాదు. పర స్త్రీలను తల్లిగా, చెల్లిగా సంభావించే మహోన్నత సంస్కృతికి చెరగని చిరునామా రాఖీ ఆత్మీయానుబంధం. అలా ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈ రక్షా బంధన్ పవిత్రత కాలంతో పాటు మారిపోయింది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా జరుపుకోవడం ఆరంభమైంది. హృదయ పొరల్లో అర్థ్రత లోపించడం ఓ సంప్రదాయంగా మాత్రమే రక్షాబంధన్ మిగిలిపోవడం విచారకరం.

వెబ్దునియా పై చదవండి