రాష్ట్ర విభజనపై ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేస్తాం : సోనియా

శనివారం, 24 ఆగస్టు 2013 (15:34 IST)
File
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారి స్పందించారు. న్యూఢిల్లీలో శనివారం జాతీయ మీడియా సెంటర్‌ను ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆ సమయంలో రాష్ట్ర విభజనపై ఆమె తొలిసారి స్పందించారు. రాష్ట్ర విభజన అంశంపై ప్రభుత్వం తరపున మరో కమిటీ వేయనున్నట్టు చెప్పారు.

ఇప్పటికే కేంద్రమంత్రి ఆంటోనీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఓ కమిటీ వేసిన విషయం తెలిసిందే. సీమాంధ్రుల సమస్యలను ఆంటోనీ కమిటీ వింటుందన్నారు. ఆంటోనీ కమిటీకి అదనంగా ప్రభుత్వం కమిటీ వేస్తున్నట్లు చెప్పిన ఆమె.... కమిటీ విధివిధానాలను మాత్రం వెల్లడించలేదు. పైపెచ్చు.. ఈ కమిటీని ఎందుకు వేస్తున్నారో కూడా ఆమె స్పష్టం చేయక పోవడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి