రాష్ట్రాన్ని విభజించే అధికారం పార్లమెంట్‌కు ఉంది : సుప్రీం

సోమవారం, 26 ఆగస్టు 2013 (13:17 IST)
File
FILE
రాష్ట్ర విభజనపై దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రానికి లేదంటూ న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు సోమవారం కొట్టివేసింది. పైపెచ్చు ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రానికి లేదని కృష్ణయ్య పేర్కొనగా.. రాష్ట్రాన్ని విభజించే అధికారం పార్లమెంట్‌కు ఉదంటూ స్పష్టం చేసింది.

అయితే, రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటనచేయనందున పిటీషన్‌ విచారణార్హం కాదని కోర్టు పేర్కొంది. ఒకవేళ రాష్ట్ర విభజనపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేస్తే పిటీషనర్‌ తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని, ఆ తర్వాతే తమ వద్దకు రావాలంటూ సూచన చేసింది.

వెబ్దునియా పై చదవండి