సమైక్యాంధ్ర పోరాటమంటూ జారిపోయిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు!

FILE
సమైక్యాంద్ర కోసం పోరాడతామంటూ ప్రకటనలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు జారిపోయారు. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, నంద్యాల ఎంపీ ఎస్.పి.వై.రెడ్డిలు కొద్దిసేపు లోక్ సభలో సమైక్య నినాదాలు చేసి స్పీకర్ వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపారు. ఆ తర్వాత వారు ఆహార భద్రత బిల్లుకు ఓటు వేశారు.

వీరిద్దరూ అంతకుముందు లోక్ సభకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవి ఆమోదం పొందకపోవడంతో సభకు వెళ్లారు. మిగిలిన ఎనిమిది మంది ఎమ్.పిలు సస్పెండ్ అయినప్పుడు వీరు సభలో లేరు.తదుపరి వెళ్లినా సస్పెండ్ కాలేదు.

విప్ ప్రకారం ఓటు చేశారు.వీరిద్దరూ వ్యాపారవేత్తలే కావడం విశేషం. మొత్తం మీద వీరిద్దరూ జారి పోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి