సోనియా ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మోడీ

మంగళవారం, 27 ఆగస్టు 2013 (11:55 IST)
File
FILE
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటే ఒంటికాలిపై దూసుకెళ్లే మోడీ.. కొద్దిసేపు తన దూకుడును కట్టిపెట్టారు. సోమవారం లోక్‌సభలో సోనియా స్వల్ప అస్వస్థతకు గురైన వెంటనే ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమె ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.

పైపెచ్చు నరేంద్ర మోడీ తన ట్విట్టర్‌లో స్పందించారు. స్వల్పంగా అనారోగ్యానికి గురైన సోనియా గాంధీని అన్ని సౌకర్యాలు గల అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించాల్సింది. సోనియాను ఆస్పత్రికి తరలించడంలో అత్యవసర వైద్య విధానాలు పాటించలేదు. లోక్సభ నుంచి ఆమెను బయటకు తీసుకొచ్చేటపుడు వీల్ చైయిర్ లేదా స్ట్రెచ్చర్‌ను వాడాల్సింది అని మోడీ తన ట్విట్టర్‌‍‌లో పేర్కొన్నారు.

కాగా, ఆహార భద్రత బిల్లుపై సోమవారం రాత్రి లోక్‌సభలో ఓటింగ్ కొనసాగుతుండగా సోనియా గాంధీ అస్వస్థకు గురైన విషయం తెల్సిందే. రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కుమారి సెల్జా ఆమెను కారులో ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం ఆమెను డిశ్చార్జ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి