సల్మాన్‌పై ముస్లిం మేధావులు మండిపాటు.. మోడీతో చేతులు కలుపుతావా?

శనివారం, 19 ఏప్రియల్ 2014 (14:01 IST)
FILE
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్‌లపై ముస్లీం మేధావుల వేదిక ఒకటి మండిపడింది. బీజీపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించడంతో సల్మాన్‌పై ముస్లీం మేధావులు మండిపడతున్నారు. తమ వ్యాపారాల ప్రయోజనాల కోసమే సల్మాన్, సలీం.. మోడీని ఆకాశానికెత్తేస్తున్నారని ఫోరం ఫర్ ముస్లిం స్టడీస్ అండ్ అనాలసిస్ (ఎఫ్ఎంఎస్ఏ) అసంతృప్తి వ్యకం చేసింది.

ఇటీవల నరేంద్ర మోడీకి సంబంధించిన ఉర్దూ వెబ్‌సైట్ సలీంఖాన్ ప్రారంభించడాన్ని 'ఎఫ్ఎంఎస్ఏ' తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన సైఫై మహోత్సవాల్లో సల్మాన్‌ఖాన్ పొల్గనడాన్ని కూడా ఖండించింది. అక్కడ ఓ వైపు శిభిరాల్లో తలదాచుకున్న ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితులు, ముఖ్యంగా చిన్నారులు ఎముకలు కొరికే చలితో బాధపడుతుంటే, మరోవైపు అక్కడ ఉత్సవాల్లో పాల్గొనడం ఏమిటని సల్మాన్‌ను ప్రశ్నించింది. ఇప్పుడేమో గుజరాత్‌లో నరమేధానికై కారణమైన మోడీతో చేతులు కలపడం ఏమిటని ప్రశ్నించింది.

వెబ్దునియా పై చదవండి