బాబా రాందేవ్ ఓ హవాలా వ్యాపారి : దిగ్విజయ్ సింగ్

ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (14:27 IST)
IFM
FILE
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ హవానా వ్యాపారి అని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. రాందేవ్‌ని హవాలా వ్యాపారిగా అభివర్ణిస్తున్నానంటూ ఆయన ఆదివారం ట్వీట్స్ చేశారు.

అంతేకాకుండా, బాబా రాందేవ్ ఒక దొంగ, దోపిడీదారుడు అని నేను చెప్పినప్పుడు నమ్మని వాళ్లు నా మాటలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. రాందేవ్ ఒక హవాలా వ్యాపారి అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచడం గురించి బీజేపీ అభ్యర్థితో కలిసి మీడియా సమావేశంలో ముచ్చటిస్తూ బాబా రాందేవ్ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి