బీజేపీ నేత గిరిరాజ్ సింగ్‌కి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (20:00 IST)
FILE
ఎన్నికలు 2014 సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినపై చట్టం కఠినంగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా నాయకుడు గిరిరాజ్ సింగ్‌కు బొకారో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎన్నికలు 2014 ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ అరెస్ట్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కు బొకారో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జార్ఖండ్‌లో ప్రసంగిస్తూ... బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వ్యతిరేకించే వారంతా పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ పిలుపునిచ్చారు.

దీంతో ఆయనకు వ్యతిరేకంగా రెండు ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేశారు. తొలుత బొకారో, ఆతర్వాత దియోఘర్ జిల్లాలో కేసు నమోదు చేశారు. ఫలితంగా గిరిరాజ్ అరెస్ట్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌కు బొకారో సబ్ డివిజనల్ జుడీషియల్ కోర్టు మేజిస్ట్రేట్ అమిత్ శేఖర్ స్పందించి అరెస్ట్‌కు ఆదేశించారు. ఈయన బీహార్ రాష్ట్రంలోని నవాడా లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి