షిండే నెల రోజుల మాట... తెలంగాణ రాదేమో...? కేసీఆర్ డౌట్

శుక్రవారం, 28 డిశెంబరు 2012 (13:01 IST)
FILE
షిండే చెప్పిన మాటలు కంటి తుడుపు చర్యేనని కేసీఆర్ అన్నారు. షిండే నెల రోజులు గడువు పెట్టడం చూస్తుంటే చిదంబరం చెప్పిన మాటలు తనకు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. ఆనాడు చిదంబరం 4 వారాలలో తేల్చేస్తానని చెబితే ఇప్పుడు షిండే నెల రోజులు అంటున్నారనీ, ఆయన మాటలు నమ్మశక్యంగా లేవని అన్నారు కేసీఆర్.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చెప్పకుండా నిర్ణయం మీ చేతుల్లోనే ఉందని చేతులు విదిల్చుకుందన్నారు. తెదేపా 2008 లేఖను పట్టుకుని వేలాడుతోంది తప్ప తెలంగాణ ఇవ్వాలని చెప్పిందే లేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ రెండు వాదనలను భేషుగ్గా వినిపించిందన్నారు. ఇక ఎంఐఎం రాయల తెలంగాణ అంటూ పల్లవి అందుకుందనీ, దీన్నిబట్టి చూస్తుంటే రాష్ట్రంలో పార్టీలు నాటకాలాడుతుంటే కేంద్రం అంతకు మించిన నాటకమే ఆడుతోందని దుయ్యబట్టారు. అఖిలపక్ష సమావేశం తమకు పూర్తి నిరాశను కల్గించిందనీ, అందువల్ల తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి