దక్షిణాఫ్రికాలో అత్యధిక సంపన్నుడు.. లక్ష్మీ మిట్టల్

FILE
ప్రముఖ భారతీయ ఉక్కు ధిగ్గజం లక్ష్మీమిట్టల్.. దక్షిణాఫ్రికాలోని శక్తివంతమైన 150 మంది పేరెన్నికగన్న వ్యాపారవేత్తలలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. "వీక్లీ సండే టైమ్స్" విడుదల చేసిన ఈ జాబితాలో.. వరుసగా ఐదోసారి మిట్టల్ ఈ ఘనతను సాధించారు.

గత సంవత్సర కాలంగా ఆర్థికమాంద్యంతో విలవిలలాడుతున్నప్పటికీ.. వ్యాపారంలో లాభాలను సాధించిన మిట్టల్.. శక్తివంతమైన, ప్రభావవంతమైన వ్యాపారవేత్తల్లో.. మొదటి స్థానంలో నిలిచారు. అంతేగాకుండా.. ఆయన దక్షిణాఫ్రికాలో నివసించనప్పటికీ వ్యాపారంలో మేటిగా నిలిచి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు.

సుమారు ఆరునెలల కాలం నుంచి ఆర్సెలర్ మిట్టల్ సౌత్ ఆఫ్రికా కంపెనీ... స్టాక్ మార్కెట్‌లో ఆదాయం పడిపోయింది. ఈ కంపెనీ ఆదాయంలో 45.7 బిలియన్ రాండ్లలో, 16.95 బిలియన్ రాండ్‌ల లోటు ఏర్పడినా మిట్టల్ మొదటి స్థానంలో నిలవటం విశేషం. కాగా.. అత్యధిక ధనవంతుల జాబితాను జోహెన్నెస్‌బర్గ్‌లోని సెక్యూరిటీస్ ఎక్చేంజ్‌లో నమోదైన అన్ని కంపెనీల ప్రస్తుత వివరాలను బట్టి ఎంపిక చేశారు.

ఇదిలా ఉంటే... ఆఫ్రికన్ రెయిన్‌బో మినరల్స్ అధినేత పాట్రిస్ మోట్సెపేను కొద్దిపాటి తేడాలతో మిట్టల్ అధిగమించి.. నెంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. వీరిద్దరికీ మరికాస్త దూరంలో నైకీ ఓబెన్‌హైమర్ నిలిచారు. ఆ తరువాత 150 మంది జాబితాలో రాగీ మూన్‌సామీ (61), అక్తర్ దేశ్‌ముఖ్ (143), ముస్తక్ బ్రే (145), యోగేష్ నర్సింగ్ (147).. తదితరులు నిలిచారు.

వెబ్దునియా పై చదవండి