సంఖ్యాశాస్త్రంలో 11, 22 అనే సంఖ్యలు మాస్టర్ నెంబర్లట. మైకేల్ జోర్డాన్, బిల్ క్లింటన్, టిమ్ మెక్ గ్రాలు 11వ సంఖ్యలో పుట్టగా, జాన్ అష్రఫ్, డీన్ మార్టిన్, సర్ రిచర్డ్ బ్రాన్సన్ 22వ సంఖ్యలో పుట్టారు. ఈ సంఖ్యలో పుట్టిన జాతకులు ఉన్నత పదవులను, సామాజంలో మంచి గుర్తింపును పొందుతారు.
ఇక 11వ సంఖ్యలో పుట్టిన జాతకులకు పట్టుదల ఎక్కువ. అనుకున్న కార్యాన్ని ముగించేంతవరకు వెనుకడుగు వేయరు. ఇతరుల వద్ద మాట్లాడేటప్పుడు భయపడే ఈ జాతకుల్లో నాయకత్వ లక్షణాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. సృజనాత్మకత కలిగివుండే ఈ సంఖ్యలో పుట్టిన జాతకులకు ఆధ్యాత్మికంపై మక్కువ ఎక్కువ. క్రమశిక్షణతో ప్రవర్తిస్తారు.
ఇక 22వ సంఖ్య సంఖ్యాశాస్త్రంలో పవర్‌ఫుల్ నెంబర్. ఈ 22 సంఖ్యలో పుట్టిన వారు.. తమ కలలను సాకారం చేసేంతవరకు నిద్రపోరు. ఇతరులకు సలహాలిచ్చి మంచిదారిన నడిపే వీరు సహజత్వానికి ప్రాముఖ్యత ఇస్తారు. రాజకీయరంగంలో బాగా రాణిస్తారు. ఒత్తిడిని అధిగమించి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు.