వక్షోజాలపై నలుపు - ఎరుపు పుట్టుమచ్చలు ఉంటే.. ఫలితం ఏమిటి?

శనివారం, 3 మార్చి 2012 (20:38 IST)
యువతుల వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు, పుట్టుమచ్చ రంగులను బట్టి వారి జీవితంలో పరిణామాలు చోటుచేసుకుంటాయంటాయట. ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

యువతి కుడి వక్షోజంపై తిలకం రంగులో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆమె సంతానవతి అవుతుంది. అయితే సామాన్యమైన జీవితాన్ని మాత్రమే గడుపుతుంది. పురుష సంతానం అధికంగా ఉంటుంది.

ఎడమ కుచముపై బొట్టు ఆకారంలో ఎరుపు రంగు కలిగిన మచ్చ ఉన్నచో ఆ స్త్రీ పురుష సంతానం ప్రసవించిన పిదప భర్తకు గండం కలుగుతుంది. కనుక దీనికి వెనువెంటనే శాంతి చేయించుకోవలసి ఉంటుంది.

కుడి స్తనమునకు కుడి భాగమున ఎర్రటి పుట్టుమచ్చ ఉన్నచో ఆ స్త్రీ ఇతరులను దూషించేదిగా ఉంటుంది. భర్త మాటను లెక్కచేయదు. కోప స్వభావం అధికంగా ఉంటుంది.

కుడి స్తనమునకు ఎడవైపున మచ్చ ఉన్నట్లయితే పతి భక్తి కలిగి, దైవ భక్తితో ఉంటుంది. దేవబ్రాహ్మణ పూజలు చేస్తుంటుంది. సంతానవతియై సర్వసుఖములు పొందుతుంది. బంధుప్రీతి కలిగి ఉంటుంది. ఎడమ వక్షోజానికి ఎడమ భాగమున మచ్చ ఉన్నట్లయితే ఆ స్త్రీకి సంతాన భాగ్యం ఉండదు. అయితే తీరని కామము కలిగి ఉంటుంది.

ఇక వక్షోజాల దిగువ భాగమునకు దగ్గరగా మచ్చి కలిగిన స్త్రీ సమస్త భోగములను అనుభవిస్తుంది. కుచములకు మరీ క్రింది భాగమున మచ్చ ఉన్నట్లయితే నిలకడలేని మనసు కలిగి ఉంటుంది. మితము లేని ఆశతో, కోప స్వభావంతో ఉంటుంది.

మొత్తమ్మీద వక్షస్థలమున మచ్చ ఉన్నట్లయితే స్త్రీకి సర్వ సౌఖ్యములేనని చెప్పవచ్చు. అయితే ప్రతి విషయములో మచ్చ యొక్క ఆకార పరిమాణాన్ని బట్టి ఫలితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి