సోమవారం (30-04-2018) - దంపతుల మధ్య పొత్తు కుదరదు...

సోమవారం, 30 ఏప్రియల్ 2018 (08:10 IST)
మేషం : ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి వల్ల మాటపడకతప్పదు. ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.
 
వృషభం : రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధవహించండి. దంపతులకు ఏ విషయంలోను పొత్తుకుదరదు. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. 
 
మిథునం : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. బాగా నమ్మే వ్యక్తులే మిమ్ములను మోసం చేసే ఆస్కారం ఉంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
కర్కాటకం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి మిశ్రమ ఫలితం. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. చిరకాల కోరిక నెరవేరే సమయం. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. గృహంలో మార్పులకై యత్నాలు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటగలవు. 
 
సింహం : మీడియా రంగాల వారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మెుండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. ద్విచక్ర వాహనం పై దూరప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. ప్రైవేటు సంస్థలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
కన్య : ఉద్యోగములో ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా ఉంటాయి. రాజకీయ రంగాల వారికి ప్రయాణాలు వాయిదా పడుటమంచిది. వసతి ఏర్పాట్లు విషయంలో చిక్కులు ఎదురవుతాయి. స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
 
తుల : ఆర్థికలావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. చిట్స్, ఫైనాన్సు సంస్థల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి గురవుతారు. ప్రణాళికాబద్ధంగా శ్రమించి మీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
వృశ్చికం : ఆధ్యాత్మిక ఆలోచనలు చుట్టుముడతాయి. దంపతుల మధ్య కలహాలు, అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సొంత వ్యాపారాలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. 
 
ధనస్సు : గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురువుతాయి. పారశ్రామిక రంగంలో వారికి కార్మికులకు మధ్య పరస్పర అవగాహన లోపం. ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు.
 
మకరం : వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం, చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్ధతో నిర్వర్తించే ప్రయత్నం చేయండి. మీ మాటా, తీరు వాక్‌చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కిరాణా, ఫ్యాన్నీ, వస్ర వ్యాపార రంగాల్లో వారికి పురోభివృద్ధి. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కుంభం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల పనివారికి చికాకులు అధికమవుతాయి. మీ సంతానం భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాయిదా పడిన మెుక్కుబడులు తీర్చుకుంటారు. 
 
మీనం : ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తారు. బ్యాంకింగ్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. వ్యాపారాలకు కొత్త కొత్త పథకాలు, ప్రణాలికలు రూపొందిస్తారు. గత అనుభవాలు గుర్తుకొస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు