శ్రీ రాముడి జాతకానికి శనివారం పూజ చేస్తే..? (video)

శనివారం, 5 సెప్టెంబరు 2020 (05:00 IST)
శ్రీపతి అయిన శ్రీ నారాయణ స్వామి అవతారాల్లో ముఖ్యమైనది శ్రీరామావతారం. శ్రీరాముని జనన జాతకంలో ఐదు గ్రహాలు ఉచ్ఛస్థానంలో వుంటాయి. శుక్రుడు, సూర్యుడు, బుధుడు, గురు, చంద్ర  గ్రహాలు ఉచ్ఛస్థానంలో వుండటం శ్రేష్ఠమైనది. ఈ మహా శ్రేష్టమైన రాముని జాతక పటాన్ని పూజా మందిరంలో వుంచి పూజించడం ద్వారా.. శ్రద్ధతో పూజించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 


 
అలాగే శ్రీరామ జాతకాన్ని పూజా మందిరంలో వుంచి పూజించడంతో జాతకపరమైన నవగ్రహ దోషాలను తొలగించుకోవచ్చు. ఐశ్వర్యాలు చేకూరుతాయి. సమస్ దోషాలు తొలగిపోతాయి. ఆయుర్దాయం పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. 
 
అలాగే శనివారం రోజు రావి చెట్టు నీటిలో పాలతో పాటు చక్కెరను కలపాలి. తేలికపాటి నూనె దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా శని దేవుడి దయ ఎప్పుడూ అలానే ఉంటుంది. ఇదే సమయంలో అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా వైద్యం చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా జీవితంలో ఎలాంటి సమస్యలనైనా అధిగమిస్తారు. ఆర్థికంగానూ పుంజుకుంటారు.
Lord Rama
 
శనివారం రోజు రాముడి పేరును కాగితంపై రాసి, ఆ కాగితాన్ని పిండితో కలపాలి. ఆ పిండిని చిన్న గుళికలుగా చేసి చేపలకు తినిపిస్తే మంచి జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా శని దోషం తొలుగుతుంది. అంతేకాకండా శని దుష్ప్రభావం కూడా పోతుంది. జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా రుణ విముక్తి పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు