కర్ణుడు, విభీషణుడు.... ఇద్దరిలో ఎవరి దారి మంచిది..?

బుధవారం, 6 ఫిబ్రవరి 2013 (19:16 IST)
WD
దుర్యోధనుని ఉప్పు తినడం వల్ల పాండవులు సోదరులని తెలిసినా యుద్దంలో దిగాడు కర్ణుడు. రాముని చేరి అన్నగారి చావుకు కారణమయ్యాడు విభీషణుడు. ఈ ఇద్దరిలో ఎవరి దారి మంచిది? అంటే, రక్తసంబంధం ఎంతగా వున్నా, ఒకే తల్లికడుపున పుట్టిన అన్నదమ్ములైనా ధర్మాన్ని విడిచి లోక కంటకంగా తయారవుతూ, వంశ నాశనానికి దిగిన పాపాచారుల నుండి సామాన్యులకు సుఖశాంతులు కలిగించడం మంచిదో లేక ఆ దుర్మార్గుల తిండి తింటూ వారి కోసం తన జీవితాన్ని బలి ఇవ్వడం మంచిదో ఆలోచించుకోవడానికే రామాయణ భారతాలలో విభీషణ, కర్ణుల ప్రవర్తన.

మంచి చెడులనేవి అన్ని కాలాలలో అందరికీ ఒకేవిధంగా వుండవు. ఆనాడే కాదు, ఈనాడైనా అధికారంలో వున్నవారికీ, వారి పాదాల కిందపడి నలుగుతున్నవారికీ వుండే తేడా చూస్తూ విభీషణుని వలె తిరగబడలేక కర్ణునివలె బలి అవుతున్నవారికి భారత, రామాయణాలు వంట బట్టించాల్సిందే.

వెబ్దునియా పై చదవండి