పుష్యమాసంలో సూర్యారాధన మంచిది

పుష్యమాసంలో సూర్యభగవానుడిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. సర్వదేవతామయుడు, సర్వ వేదమూర్తి అయిన సూర్యభగవానుడిని పుష్యమాసంలో ఆరాధించడం ద్వారా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందవచ్చునని పురోహితులు చెబుతున్నారు.

ఈ మాసమంతా నియమంగా సూర్యుని ఆరాధిస్తూ.. "ఆదిత్య హృదయం" వంటివి పారాయణం చేయడం మంచిది. ప్రతి ఆదివారం ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి, క్షీరాన్నం (పాయసాన్నం) మాత్రం వండి సూర్యదేవునికి సమర్పించాలి.

ఆ రోజు తరిగిన కూరగాయలు, మాంసం వంటివి తినకూడదు. కత్తి తగలని పదార్థాలను మాత్రం ఆహారంగా తీసుకోవచ్చునని పండితులు అంటున్నారు. పుష్యమాసం పూర్తిగా ఆదిత్యునిని పూజించలేని వారు.. ప్రతి నిత్యం శుచిగా స్నానమాడి, సూర్యోదయం సమయాన భగవానుడిని నమస్కరించుకుంటే పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం.

వెబ్దునియా పై చదవండి