వినయమైన భార్య కావాలంటే..?

పురాణాలను బట్టి బలి చక్రవర్తి మూడడుగులు విష్ణుముర్తికి దానం చేసి చిరస్మరణీయుడయ్యాడు. అదేవిధంగా శిబి చక్రవర్తి పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం చేసి ఉత్తముడయ్యాడు. ఇకపోతే.. కర్ణుడు తనకు సహజంగా ఉన్న రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా ప్రసిద్ధి చెందాడు.

అందుచేత గొప్ప గొప్ప వస్తువులు దానం చేయకపోయినా, ఉన్నంతలో కాసింత ఇతరులకు దానం చేయడం ద్వారా పుణ్యఫలితాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా చేసే దానానికి అనుగుణంగా ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

ఇందులో భాగంగా.. దానాలు వాటి ఫలితాలను పరిశీలిస్తే.. బంగారం దానం చేస్తే, తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. అదేవిధంగా వెండి వస్తువులను దానం చేస్తే ఆకర్షణీయ శరీరం మీ వశమవుతుందని పండితులు అంటున్నారు.

ఇకపోతే.. బియ్యం, పప్పు వంటి ధాన్యాలను దానం ఇస్తే.. గృహంలో సిరిసంపదలు వెల్లి విరుస్తాయి. పేదలకు అన్నదానం చేస్తే సుఖసంతోషాలు కలుగుతాయి. పేదలకు వస్త్ర దానం చేస్తే.. అందమైన, వినయమైన భార్య లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

అదేవిధంగా పేద విద్యార్థుల విద్యకు సహకరిస్తే.. మంచి సంతానం కలుగుతుందని, జంతువులు, పశువులకు నీరు, ఆహారమిస్తే ఆరోగ్య వంతులుగా ఉంటారని పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి