అక్షయ తృతీయ వైశాఖ శుక్ల పక్షం తృతీయ తిథి నాడు (మే 3వ తేదీన) దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. ఈ రోజున చేసే దానాలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఈరోజున కొనే బంగారం, వెండి ఎన్నటికీ తరగదని విశ్వాసం. అందుకే అక్షయ తృతీయ రోజుల దానధర్మాలు చేయడం, బంగారం, వెండి వస్తువులు కొనడం చేస్తుంటారు.
బ్రహ్మదేవుని కుమారుడు అక్షయ కుమారుడు ఈ తేదీన జన్మించాడు. అందుకే వైశాఖ శుక్ల తృతీయ తేదీని అక్షయ తృతీయ అంటారు. గంగా అవతరణ, పరశురామ జయంతి కూడా ఈ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తారు.
అక్షయ తృతీయ రోజు శుభకార్యాలకు చాలా మంచిది. ఆ రోజు కొత్త బట్టలు, ఆభరణాలు, ఇల్లు, కారు వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.