స్వాతి నక్షత్రం మూడో పాదంలో పుట్టారా..?

స్వాతి నక్షత్రం మూడో పుట్టిన జాతకులు గోమేధికమును ధరించడం ద్వారా సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులకు తొమ్మిదేళ్ల నుంచి రాహు మహర్ధశ కావడంతో గోమేధికమను ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.

అలాగే స్వాతి నక్షత్ర జాతకులకు 9 సంవత్సరము నుండి 25 వయస్సు వరకు గురు మహర్ధశ ప్రభావం ఉండటంతో కనకపుష్యరాగమును బంగారంతో పొదిగించి చూపుడు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

ఇక.. 25-44 వయస్సు వరకు శని మహర్ధశ ప్రభావం ఉండటంతో.. ఈ జాతకులు నీల రత్నాన్ని వెండిలో పొదిగించుకుని మధ్యవేలుకు ధరించడం మంచిది. ఈ నీలరత్నాన్ని ధరించడం ద్వారా శనిగ్రహ ప్రభావంచే కలిగే అశుభఫలితాలు దరిచేరవని రత్నాలశాస్త్రం చెబుతోంది.

ఇకపోతే.. 44 నుంచి 61వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరం. ఇంకా 61 నుంచి 68వ సంవత్సరం వరకు కేతు మహర్దశ ప్రభావం ఉన్నందున వైఢూర్యమును వెండితో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అలాగే 68వ సంవత్సరం నుంచి 88 సంవత్సరాల వరకు శుక్ర మహర్ధశతో వజ్రమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

కాగా స్వాతి నక్షత్రంలో పుట్టిన జాతకులు ఈతిబాధల నుంచి విముక్తి పొందాలంటే.. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో నేతితో దీపమెలిగించడం చేయాలని పురోహితులు సూచిస్తున్నారు. ఇలా తొమ్మిది వారాలు చేస్తే ఈతిబాధలు తొలగిపోయి.. అష్టైశ్వర్యాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక స్థితి మెరుగపడటం వంటి శుభ సూచనలున్నాయని వారు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి