వృశ్చిక రాశిలో జన్మించిన మీకు కుజ దోషం ఉందా...?

గురువారం, 17 ఏప్రియల్ 2014 (17:00 IST)
File
FILE
మీరు వృశ్చికరాశిలో జన్మించారా..? లేదా వృశ్చిక రాశిలో జన్మించిన వారికి కుజదోషముందని జ్యోతిష్కులు ఎవరైనా చెప్పారా..? ఇలాంటి వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. కుజదోష నివారణకు పగడం ధరించినట్టయితే, ఈ దోషం నుంచి విముక్తి పొందవచ్చని చెపుతున్నారు. ఆంగ్లంలో కొరల్ అని పిలువబడే పగడం ఎరుపు రంగును కలిగి ఉంటుంది.

భౌమరత్నము, ప్రవాళము, మిరజాన్ పోలా అనే పిలువబడే పగడాన్ని ధరించడం ద్వారా భూతప్రేతాది భయాలు తొలగిపోతాయని రత్నాల శాస్త్రం చెబుతోంది. పగడ రత్నంతో తయారైన మాలను వృశ్చికరాశి మహిళలు ధరిస్తే.. దిష్టి దరిచేరదని చెపుతున్నారు. వృశ్చికరాశికి కుజుడు అధిపతి కావున.. ఈ జాతకులు మొండి పట్టుదల కలవారుగా ఉంటారు.

పగడాన్ని ఎలా కనుగొనడం ఎలా...?
పగడం చాలా సున్నితంగా ఉండి పట్టుకుంటే జారిపోతుంది. నిజమైన పగడాన్ని నిప్పులో వేస్తే కాంతిపోతుంది. దీనిపై నీటి బిందువులు ఉంచితే అలానే ఉంటుంది. నిజమైన పగడంపై హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేస్తే దానిపై మచ్చపడుతుంది.

ఎలా ధరించాలంటే..?
మంగళవారం సూర్యోదయానికి ముందు ధరించాలి. రాగి, వెండి లోహముతో పొదిగించి పగడాన్ని ధరించడం శ్రేయస్కరం. కుడిచేతి ఉంగరపు వ్రేలుకు ధరించాలి. ముందుగా పాలు మరియు గంగా జలంలో శుద్ధి చేయాలి. కుజ ధ్యాన శ్లోకాన్ని 70 మార్లు ధ్యానించి ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి