కృత్తికా నక్షత్రం: మహిళా జాతకుల ఫలాలు

సోమవారం, 29 సెప్టెంబరు 2008 (15:48 IST)
కృత్తికా నక్షత్రంలో జన్మించిన మహిళలు సౌందర్యవంతులుగా ఉంటారు. ఇతరులను ఆకర్షించే ఛాయను కలిగి ఉంటారు. ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు. ఇతరులకు సహకరించే స్వభావులు. అయితే పట్టుదల స్వభావంతో తాము అనుకున్న కార్యాన్ని పూర్తిచేసే వరకు ఊరుకోరని జ్యోతిష్కులు అంటున్నారు.

ఈ నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన వారు విద్యలో రాణిస్తారు. భవిష్యత్తు ప్రణాళికను ఉద్దేశించి వాటిని నడిపించటానికి ఎల్లప్పుడు తీవ్రంగా శ్రమిస్తారు. బుద్ధికుశలతతో ఎట్టి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోగలరు.

రెండో పాదంలో జన్మించిన స్త్రీలు ప్రతి విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసే స్వభావం కలిగి ఉంటారు. దీనివలన జీవిత పురోగమన అవకాశాలు దూరమవుతాయి. కోపంతో చెడుమార్గాలను ఎంచుకునే పరిస్థితులు కూడా దగ్గరవుతాయి. చెడు మార్గాన్ని అన్వేషిస్తారు. వీరిచేత ఇతరులకు ఇబ్బందులు ఏర్పడుతాయి.

మూడో పాదంలో జన్మించిన మహిళా జాతకులు సామర్థ్యవంతంగా ఎట్టి కార్యాన్ని సాధించగలుగుతారు. చెడుమార్గంలో పయనించటానికి వెనుకాడరు. దురాలోచనతో జీవితంలో అభివృద్ధి చెందలేరు. అయితే వీరికి గల బుద్ధికుశలతను మంచి మార్గంలో ఉపయోగిస్తే మంచి జీవితంలో పురోగమనం వైపు పయనిస్తారు.

నాలుగవ పాదంలో జన్మించిన వారు నిదానంగా ఎటువంటి కార్యాన్ని అనేక సార్లు ఆలోచించి మార్గాన్ని ఎంచుకునే స్వభావం కలవారు. అయితే అవసర స్వభావంచేత పలు అనర్దాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇతరుల ఆధీనంలో బతకటం వీరికి ఇష్టం ఉండదు.ఇతరులను తమ ఆధీనంలోకి తీసుకుని అధికారం చెలాయిస్తారని జ్యోతిష్కులు పేర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి