ఆయుర్దాయం ప్రసాదించే గ్రహాల ఆధిపత్యం

శుభగ్రహాలతో గురు లగ్నాధిపతి ఆధిపత్యం వహిస్తే ఆయుర్దాయం చేకూరుతుందని జ్యోతిష్కుల అభిప్రాయం. ఆయుషు స్థానాన్ని ఎనిమిదో స్థానంగా పరిగణిస్తారు. ఈ స్థానంలో శనీశ్వరుని ఆధిపత్యంతో పాటు, అతని దృష్టి ప్రభావం చేత ఆయుర్దాయం పెరుగుతుందని వారు పేర్కొంటున్నారు.

లగ్నాధిపతి, అష్టమాధిపతి, దశమాధిపతుల ఆధిపత్యం చేత ఆయుర్దాయం పెరుగుతుంది. లగ్నాధిపతి, అష్టమాధిపతులు చర రాశుల్లో ఆధిపత్యం వహిస్తే ఆయుర్దాయం చేకూరుతుంది.

లగ్నాధిపతి ఉభయస్థానంలోనూ, అష్టమాధిపతి స్థిరస్థానంలో ఉంటే ఆయుష్మంతులుగా జీవిస్తారు. లగ్నాధిపతికి 6, 8, 12 స్థానాల్లో అశుభ గ్రహాలు, త్రికోణ స్థానాల్లో శుభగ్రహాలుంటే వ్యాధులు దరిచేరవు. దీనివలన ఆయుర్దాయం పెరుగుతుంది. లగ్నాధిపతి చరరాశిలోనూ, అష్టమాధిపతి స్థిర స్థానంలోనూ ఉంటే మధ్యస్థ ఆయుర్దాయం కలుగుతుందని జ్యోతిష్కులు అంటున్నారు.

జాతకులు తమ జాతక ప్రకారం ఎనిమిదో స్థాన బల ప్రభావంతో వారి ఆయుర్దాయంను జ్యోతిష్కులు గణిస్తారు. ఎనిమిదో స్థాన గణాంకాల ప్రకారమే జాతకులకు ఆయుషు చేకూరుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.

వెబ్దునియా పై చదవండి