మీకు పెదాలపై పుట్టుమచ్చ ఉందా?

మన శరీరంలోని వివిధ భాగాలపై వివిధ ఆకారాల్లో ఉండే నల్లటి పుట్టు మచ్చలతో మనకు పలు అదృష్టాలు అనుభవాలు కలుగుతాయని జ్యోతిష్యులు అంటున్నారు. ప్రత్యేకించి మనది హైందవమత దేశమైనందున ఆచార సాంప్రదాయాలపైనే కాకుండా ఇటువంటి వాటిపై కూడా అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు శరీరంపై పలు ప్రాంతాల్లోని పుట్టుమచ్చలు.. వాటి మంచి చెడులను గురించి తెలుసుకుందాం...

సాధారణంగా పెద్ద పుట్టుమచ్చలు అదృష్టాన్ని కల్గిస్తాయి. ఇక గుండ్రంగా, కోలగా ఉన్న మరికొన్ని మచ్చలు కొన్ని శుభ ఫలితాలను మరికొన్ని అశుభ ఫలితాలనిస్తాయి.

పెదాలపై....
పెదాలపై మచ్చ కలిగి ఉంటే ఇతరులను ప్రేమించడమే కాక, ఇతరుల ప్రేమను కూడా పొందేవారుగా ఉంటారు. వీరు ప్రారంభించిన ప్రతి పనినీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సున్నితమైన జీర్ణకోశం కలిగి ఉంటారు.

బొడ్డు మధ్య భాగాన....
మచ్చ ఒకవేళ బొడ్డు మధ్య భాగాన ఉంటే స్త్రీలకైతే మంచి భర్త లభిస్తాడు. పేరుప్రతిష్ఠలు సాధించి పెట్టే సంతానాన్ని కలిగి ఉంటారు. పురుషులైతే ధనవంతులుగానూ అన్నీ కార్యాల్లో విజయం సాధిస్తారు.

రొమ్ముపై...
స్త్రీలకైతే బుద్దిమంతుడైన కుమారుడు జన్మిస్తాడు. అదే పురుషులకున్నట్లయితే పరస్త్రీ వ్యామోహం కలిగి ఉంటారు. అన్ని మంచి కార్యాలకు స్వస్తి చెప్పి కేవలం ఇతర స్త్రీల సుఖం కోసమే పాకులాడుతూ ఉంటాడు.

కాలియందు ఉంటే...
మచ్చ కాలియందుంటే వారికి దూరదృష్టి తక్కువగా ఉంటుంది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు నేర్పుతో వ్యవహరిస్తారు. పురుషులకైతే తన మాటను గౌరవించే భార్య లభిస్తుంది. వీరికి సంతానానికి లోటుండదని జ్యోతిష్కులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి